రోడ్లపై న్యూసెన్స్.. ఏడుగురికి జైలు

రోడ్లపై న్యూసెన్స్.. ఏడుగురికి జైలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: అర్ధరాత్రి వేళలో ఛత్రినాక పీఎస్​పరిధిలో రోడ్లపై తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏడుగురు యువకులకు నాంపల్లి కోర్టు వారం రోజుల జైలు శిక్ష విధించింది. కృష్ణారెడ్డి నగర్​కు చెందిన మొహ్ద్ అమన్ (25), అహ్మద్​ కాలనీకి చెందిన ఎండీ యూసుఫ్ (25),  ఫూల్​బాగ్​కు చెందిన  సోహైల్ అలియాస్​అజీమ్ (19),  కృష్ణారెడ్డినగర్​కు చెందిన కె. శ్రీకాంత్ (18), షేక్ యాసీన్ (23), సయ్యద్ అబ్దుల్లా (21), చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ గౌస్ (25) కొద్దిరోజుల కింద ఛత్రినాక రోడ్లపై రాత్రిపూట తిరుగుతూ న్యూసెన్స్​చేశారు. 

దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సయ్యద్​అబ్దుల్లాపై చాంద్రాయణగుట్టలో రౌడీ షీట్​నడుస్తోంది. అందరినీ నాంపల్లి 9వ మెట్రోపాలిట్​మెజిస్ట్రేట్​ఎదుట హాజరుపరచగా, శిక్ష విధించిందని ఛత్రినాక సీఐ కె.ఎన్. ప్రసాద్ వర్మ తెలిపారు.