హైదరాబాద్ ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్టుకు అరుదైన ఘ‌న‌త‌

హైదరాబాద్ ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్టుకు అరుదైన ఘ‌న‌త‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయ ప్రయాణికులకు తాము సొంతంగా తయారు చేసిన ఈ-డిజిటల్ సొల్యూషన్‌ను అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా నిలిచింది. దీంతో దేశంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సేవలను ప్రారంభించిన తొలి ఎయిర్‌పోర్టుగా ఆర్‌జీఐఏకి గుర్తింపు లభించింది. భారత విమానయాన రంగంలోనే ఇదొక గొప్ప మైలురాయిగా విమానాశ్రయ యాజమాన్యం పేర్కొంది.

ప్రస్తుతం ఈ సేవలు ఇండిగో ఎయిర్ లైన్స్‌లోని ఎంపిక చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. పైలెట్ ప్రయోగాలు విజయవంతమై, ప్రభుత్వ ఆమోదం పొందిన అనంతరం ఈ ఈ-బోర్డింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.