వెల్త్ హబ్గా హైదరాబాద్ ఎమ్కే వెల్త్ రిపోర్ట్

వెల్త్ హబ్గా హైదరాబాద్ ఎమ్కే వెల్త్ రిపోర్ట్

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్ నగరం వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ హబ్‌‌గా అవతరించిందని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ తెలిపింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, మౌలిక సదుపాయాలు, స్టార్టప్ వ్యవస్థ ఇందుకు దోహదం చేస్తున్నాయి. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో 5 వేల చదరపు అడుగుల స్కై మ్యాన్షన్స్ కు డిమాండ్ పెరిగింది. 

2026లో మార్కెట్లు స్థిరంగా ఉంటాయని, నిఫ్టీ 50 దాదాపు 11 నుంచి 14 శాతం రిటర్న్స్ ఇస్తుందని సంస్థ అంచనా వేసింది. బంగారం, వెండి ధరలు దీర్ఘకాలంలో పెరిగే అవకాశం ఉంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు మెరుగైన లాభాలను అందిస్తాయని ఎండీ అండ్ సీఈఓ అమీషా జైన్ పేర్కొన్నారు.