పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య

అశోక్ నగర్లో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. బృందావన్ హాస్టల్లో ఉంటున్న ప్రవల్లిక.. రూంలో ఉరేసుకుని చనిపోయింది. హాస్టల్ ఉంటూ ప్రవల్లిక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. విద్యార్ధిని డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు హాస్టల్ కు చేరుకున్నారు. అయితే అక్కడ విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. అటు పోలీసులు, పెద్ద ఎత్తున విద్యార్థులు రావడంతో..అశోక్ నగర్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రవల్లికది వరంగల్ జిల్లా అని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ప్రవల్లిక ఆత్మహత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.