ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో కుప్పకూలిన స్టాక్.. 2 నెలల ముందే షేర్లు అమ్మేసిన జున్‌జున్‌వాలా ఫ్యామిలీ..!

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో కుప్పకూలిన స్టాక్.. 2 నెలల ముందే షేర్లు అమ్మేసిన జున్‌జున్‌వాలా ఫ్యామిలీ..!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు మార్కెట్లలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో అనేక కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. గేమింగ్ పరిశ్రమకు పేమెంట్ సర్వీసులు అందించే ఆన్ లైన్ పేమెంట్ అగ్రిగేటర్ సంస్థలు కూడా తమ ఆదాయాలు తగ్గుదాయని భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆగస్టు 20న లోక్ సభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్ 2025కు ఆమోదం పొందిన తర్వాత లిస్టెడ్ గేమెంట్ సంస్థల షేర్లు ఇవాళ కుప్పకూలుతున్నాయి. కొత్త బిల్లు ఆమోదంతో ఇన్వెస్టర్లు కూడా ఈ స్టాక్ కి దూరంగా ఉంటున్నారు.

గతంలో దివంగత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా ఫ్యామిలీ ప్రముఖ గేమింగ్ సంస్థ నజారా టెక్నాలజీస్ లో పెట్టుబడులు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఏకంగా 8 శాతం పడిపోయి ఒక్కోటి రూ.వెయ్యి 125 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీనికి ముందు అంటే నిన్న కూడా స్టాక్ 13 శాతం పడిపోయింది. ఇదే సమయంలో మరో కంపెనీ డెల్టా కార్ప్ స్టాక్ కూడా నష్టాలను చూసింది.

ALSO READ : ట్రేడర్ల కోసం పర్పెచువల్ ఫ్యూచర్స్

వాస్తవానికి నజారా టెక్నాలజీస్ మాత్రమే దేశంలో లిస్ట్ అయిన అతిపెద్ద గేమింగ్ సంస్థ. దీనిని అప్పట్లో జున్‌జున్‌వాలా ఫ్యామిలీ పెట్టుబడి పెట్టి సపోర్ట్ చేసింది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ గేమింగ్ బిల్లు తీసుకురావటానికి రెండు నెలల ముందు అంటే జూన్ 2025లోనే జున్‌జున్‌వాలా ఫ్యామిలీ అప్రమత్తం అయ్యింది. కంపెనీలో తమకు ఉన్న దాదాపు 10 శాతం వాటాలను పూర్తిగా విక్రయించేసింది. అప్పట్లో దాదాపు 27లక్షల షేర్లను రూ.334 కోట్లకు బల్క్ డీల్ ద్వారా ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ తో ఎగ్జిట్ అయ్యింది జున్‌జున్‌వాలా కుటుంబం. 

వాస్తవానికి నజారా టెక్నాలజీస్ ఐపీవోకి రాకమునుపు 2017లోనే జున్‌జున్‌వాలా ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో రూ.180 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టారు. ఆ తర్వాత 2021లో లిస్టింగ్ పూర్తయ్యాక కంపెనీలో మరిన్ని వాటాలను కూడా కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది నజారా టెక్నాలజీస్ రెండు మెుబైల్ గేమింగ్ సంస్థలను కొనుగోలు చేసింది. అలాగే యూకేకి చెందిన గేమింగ్ పబ్లిషర్ సంస్థ కర్వ్ గేమ్స్ ని కూడా రూ.247 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ కొన్ని నెలల్లోనే కథ తలకిందులైంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం కొత్తగా ఆన్ లైన్ గేమింగ్ పై బిల్లును తీసుకురావటంతో దాదాపు రూ.805 కోట్ల పోకర్ బజార్ పెట్టుబడిపై నజారా సంస్థ ఆందోళన చెందుతోంది. 

బ్రోకరేజీల మాట ఇదే.. 
గతంలో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నజారా టెక్నాలజీస్ కి ఇచ్చిన రేటింగ్ 400.. ప్రస్తుతం సున్నాకు తగ్గించింది. దీంతో కంపెనీ షేర్లకు గతంలో ఇచ్చిన టార్గెట్ ధర రూ.1500ను ప్రస్తుతం రూ.1100లకు తగ్గించింది.