ట్రేడర్ల కోసం పర్పెచువల్ ఫ్యూచర్స్

ట్రేడర్ల కోసం పర్పెచువల్ ఫ్యూచర్స్

హైదరాబాద్, వెలుగు: క్రిప్టో ఎక్స్ఛేంజ్ జియోటస్, ట్రేడర్ల కోసం కొత్తగా పర్పెచువల్ ఫ్యూచర్స్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇన్వెస్టర్లు కేవలం రూ. 100 నుంచి క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. ఈ సేవలు ప్రస్తుతం 12 లక్షల మంది జియోటస్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ఆఫర్‌‌‌‌‌‌‌‌గా వచ్చే నెల 30 వరకు ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని కంపెనీ ప్రకటించింది. 

పర్పెచువల్ ఫ్యూచర్స్ అనేది గడువు తేదీ లేని ఒక పెట్టుబడి ఉత్పత్తి. దీని వల్ల ట్రేడర్లు తమకు నచ్చినంత కాలం ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించవచ్చు. ఈ కొత్త సేవ ఇన్వెస్టర్లకు మార్కెట్​లో హెచ్చుతగ్గులను తట్టుకోవడానికి సహాయపడుతుందని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ తెలిపారు.