టాప్​–10 గ్లోబల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లలో.. హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు

టాప్​–10 గ్లోబల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లలో..  హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు

న్యూఢిల్లీ: నిర్వహణ పనితీరు,  సమయపాలన పరంగా టాప్ టెన్ గ్లోబల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లలో హైదరాబాద్,  బెంగళూరు  విమానాశ్రయాలు రెండు,  మూడు స్థానాల్లో నిలిచాయి.    ఏవియేషన్  అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన 2023 ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) రివ్యూలో మూడు భారతీయ విమానాశ్రయాలు -- హైదరాబాద్, బెంగళూరు,  కోల్‌‌‌‌‌‌‌‌కతాతోపాటు  భారతీయ క్యారియర్-  ఇండిగో ఉన్నాయి. 84.42 శాతం ఓటీపీతో  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ గ్లోబల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లతో పాటు  పెద్ద విమానాశ్రయాల విభాగాలలో రెండవ స్థానంలో ఉంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08 శాతం ఓటీపీతో రెండు విభాగాల్లో మూడవ స్థానంలో ఉంది. అమెరికాలోని మిన్నియా పోలిస్- సెయింట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ 84.44 శాతం ఓటీపీతో రెండు జాబితాలలో మొదటిస్థానంలో ఉంది. మధ్యస్థ విమానాశ్రయాల విభాగంలో, కోల్‌‌‌‌‌‌‌‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో తొమ్మిదో స్థానంలో ఉంది. 

ఇదే విభాగంలో జపాన్‌‌‌‌‌‌‌‌లోని ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయం 90.71 శాతం ఓటీపీతో తొలిస్థానంలో ఉంది. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12 శాతం ఓటీపీని సాధించింది. ఇది బడ్జెట్​ ధర క్యారియర్‌‌‌‌‌‌‌‌ల విభాగంలో ఎనిమిదో స్థానంలో ఉంది.  ఆసియా– పసిఫిక్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. బడ్జెట్​ క్యారియర్‌‌‌‌‌‌‌‌ల విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ 92.36 శాతం ఓటీపీతో అగ్రస్థానంలో ఉంది. ఆసియా– పసిఫిక్ విభాగంలో, జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ 82.75 శాతం ఓటీపీతో మొదటిస్థానంలో ఉండగా, జపాన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ (82.58 శాతం), థాయ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఏషియా (82.52 శాతం) వరుసగా రెండు,  మూడవ స్థానాల్లో ఉన్నాయి.