
చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ నిరాశ పరుస్తోంది. సూపర్ ఫైవ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లోనూ ఓడింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కాలికట్ హీరోస్ జట్టు 15–-13, 18–-16, 16–-14తో వరుస సెట్లలో బ్లాక్ హాక్స్‌పై గెలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఆ జట్టు ఆటగాడు చిరాగ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా నాలుగు, మొత్తంగా ఐదింటిలో ఓడిన బ్లాక్‌హాక్స్ సూపర్ ఫైవ్స్ రేసు నుంచి వైదొలిగింది.