
ట్యాంక్ బండ్, వెలుగు: ఎన్టీఆర్ ఘాట్ వద్ద సోమవారం ఉదయం ఓ మైనర్ బాలుడు కారుతో బీభత్సం సృష్టించాడు. ఓవర్ స్పీడ్తో అదుపుతప్పి హెచ్ఎండీఏ పోల్‌ను ఢీకొట్టి, ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో బాలుడితో పాటు అతని పక్కన ఉన్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సైఫాబాద్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని సికింద్రాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. హెచ్ఎండీఏ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.