- అధికారులకు హైదరాబాద్ కలెక్టర్ డెడ్లైన్
హైదరాబాద్, వెలుగు : ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ 15 రోజుల్లోగా పూర్తిచేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు డెడ్లైన్పెట్టారు. గురువారం కలెక్టరేట్లో పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. మైనర్ రిపేర్లు, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, రెనోవేషన్ 80 శాతం పూర్తయిన చోట మరో వారం రోజుల్లోగా, మిగిలిన స్కూళ్లలో 15 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.
100 శాతం పూర్తయిన వెంటనే సర్టిఫికెట్ సమర్పించాలని సూచించారు. గతంలో ఉన్న పరిస్థితులు.. పనులు పూర్తయ్యాక పరిస్థితిపై డాక్యుమెంటేషన్ రూపొందించాలని చెప్పారు. సమావేశంలో డీఈఓ రోహిణి, టీజీఈడబ్ల్యూఐడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షఫీ మియా తదితరులు పాల్గొన్నారు.
ఆవిష్కరణల కోసం ఇంటింటా ఇన్నోవేటర్
వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ సెల్ ఏర్పాటు చేసిందని, ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆగష్టు 3వ తేదీ లోపు ఆవిష్కరణలను దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగష్టు 15న ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందన్నారు. మెదడు వ్యాపు వ్యాధి నివారణకు ఈ నెల 25 నుంచి ఆగష్టు15 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.