మహిళా హక్కులపై అవగాహన కల్పించండి : కలెక్టర్ హరిచందన

మహిళా హక్కులపై అవగాహన కల్పించండి : కలెక్టర్ హరిచందన
  • సికింద్రాబాద్ సఖి కేంద్రాన్ని విజిట్​చేసిన కలెక్టర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహిళా హక్కులు, చట్టాలపై క్యాంప్​లు పెట్టి అవగాహన కల్పించాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె సికింద్రాబాద్ లోని సఖి కేంద్రాన్ని విజిట్​చేశారు. కేంద్రానికి వచ్చే బాధితులకు భరోసా ఇచ్చి న్యాయం అందేలా చూడాలన్నారు. ఇప్పటివరకు 6,080 కేసులు పెట్టామని,  17,095 మంది బాధితులకు వివిధ రకాల సేవలందించినట్టు సిబ్బంది కలెక్టర్​కు వివరించారు. వివిధ కేసుల్లో బాధిత మహిళలకు కోర్టు సూచనల మేరకు ఈ  ఏడాది జూన్ నాటికి  రూ. 17.71 కోట్లకు పైగా చెల్లించామన్నారు. 

బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ లో భిక్షాటన చేసేవారిని, తప్పిపోయి వచ్చిన పిల్లలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. బంజారాహిల్స్ లో  నిర్మాణంలో ఉన్న సఖి సెంటర్ పనుల వివరాలను, చార్మినార్ ప్రాంతంలో సఖి కేంద్రం నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలానికి సంబంధించిన వివరాలను  తెలుసుకున్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి అక్కేశ్వరరావు, దివ్య దిశ ఎన్జీఓ నిర్వాహకులు ఫిలిప్స్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనిత రెడ్డి పాల్గొన్నారు.