స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు.. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన

స్టూడెంట్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు.. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. సోమవారం ఏవీ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల, హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. రోల్ మోడల్ కావాలంటే లక్ష్యంతో చదవాలన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి  పెట్టాలన్నారు. 

సీఎం రేవంత్​రెడ్డి ఏవీ కాలేజీలోనే చదివారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పైకి రావాలని పిలుపునిచ్చారు. డీసీపీ సెంట్రల్ జోన్ శిల్పావల్లి, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆశిష్ చక్రవర్తి, డాక్టర్​ దేవికా, ప్రిన్సిపాల్ డాక్టర్  రాజలింగం, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, పీజీ డైరెక్టర్ గోపీకృష్ణ, ఎన్‌‌‌‌సీసీ, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లు పాల్గొన్నారు.విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. 

సోమవారం ఏవీ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల, హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. రోల్ మోడల్ కావాలంటే లక్ష్యంతో చదవాలన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి  పెట్టాలన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ఏవీ కాలేజీలోనే చదివారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పైకి రావాలని పిలుపునిచ్చారు. డీసీపీ సెంట్రల్ జోన్ శిల్పావల్లి, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆశిష్ చక్రవర్తి, డాక్టర్​ దేవికా, ప్రిన్సిపాల్ డాక్టర్  రాజలింగం, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, పీజీ డైరెక్టర్ గోపీకృష్ణ, ఎన్‌‌‌‌సీసీ, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లు పాల్గొన్నారు.