పద్మారావునగర్, వెలుగు: కార్తీక మాసం రెండో సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, పూజలు జరిగాయి. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆలయంలో దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రయాథ్లాన్ క్రీడాకారుడికి సన్మానం
హైదరాబాద్ సిటీ: క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ట్రయాథ్లాన్ క్రీడాకారుడు మాస్టర్ రామును కలెక్టర్ సన్మానించి అభినందించారు. అతని విజయాలను అభినందిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరెన్నో పతకాలు సాధించాలని ఆకాక్షించారు.
