17న డిజిటల్ మార్కెటింగ్ అవగాహన సదస్సు

17న డిజిటల్ మార్కెటింగ్  అవగాహన సదస్సు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్‌‌పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కలెక్టరేట్‌‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

జెమ్ పోర్టల్, అమెజాన్, ఫ్లిప్​కార్ట్, ఓఎన్‌‌డీసీ, మీషో వంటి ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్‌‌ల ద్వారా ఉత్పత్తుల విక్రయం, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌‌పై అవగాహన కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 10లోగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, జీఎస్టీ, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వివరాలతో జిల్లా పరిశ్రమల కేంద్రంలో నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 7032845896, 8125640242 నంబర్లను సంప్రదించాలని సూచించారు.