మెహిదీపట్నం, వెలుగు: మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గోల్కొండ జోన్ ఉదయం డీసీపీ చంద్ర మోహన్ ఆధ్వర్యంలో 6 నుండి 8 గంటల వరకు జుమ్మెరాత్ బజార్, లాలాభవన్, టక్కర్‌వాడి, లోయర్ ధూల్‌పేట్ తదితర ప్రాంతాల్లో 184 మంది పోలీస్ సిబ్బంది అణువణువూ గాలించి, అక్రమంగా నిల్వ ఉంచిన 49.4 లీటర్ల మద్యం, 22 కమర్షియల్, 12 డొమెస్టిక్, 79 చిన్న గ్యాస్ సిలిండర్లు, సరైన పత్రాలు లేని 28 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
