కానిస్టేబుల్ నవీనకు హైదరాబాద్ సీపీ ప్రశంస

కానిస్టేబుల్ నవీనకు హైదరాబాద్ సీపీ ప్రశంస

జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కాపాడిన ఉమెన్ కానిస్టేబుల్ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు. ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సీపీ నుంచి ప్రశంసించడంపై నవీన సంతోషం వ్యక్తం చేశారు.

గురువారం  సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రికెట్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడడంతో పరిస్థితి అదుపు తప్పింది. గేట్లు ఓపెన్ చెయ్యగానే క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో జింఖానా మైదానంలో పనిచేసే రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయింది. అది గమనించిన బేగంపేట్ పోలీస్ స్టేషన్ లేడీ కానిస్టేబుల్ నవీన.. తన నోటి ద్వారా రజితకు శ్వాస అందిస్తూ ఆమెను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసింది. నవీన సీపీఆర్ చేయడంతో బాధితురాలు స్పృహలోకి రావడంతో ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలించారు.