హైదరాబాద్ లో ఇద్దరు సైబర్ నేరగాళ్లు అరెస్ట్

హైదరాబాద్ లో ఇద్దరు సైబర్ నేరగాళ్లు అరెస్ట్

సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందుతుల నుంచి 1.4కోట్ల నగదు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.  ఈ సందర్భంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస రెడ్డి వివరాలు వెల్లడించారు.  హైదరాబాద్ కు చెందిన బాధితురాలు 3 కోట్ల 16 లక్షలు నష్టపోయిందని చెప్పారు. నిందితుడిని గోవాలో అరెస్ట్ చేశామని తెలిపారు.  

dafabet అనే వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.  ఈ స్కామ్ అంతా దుబాయ్ నుంచి జరిగినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడని స్పష్టం చేశారు.  నిందితుడి బ్యాంక్ అకౌంట్ లో రూ. 20 లక్షలు ఫ్రీజ్ చేశామని వెల్లడించారు.  నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ కేసులో నిందితుడు ఇతరులకు చెందిన 95 బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నాడని గుర్తించామన్నారు.  

పెట్టుబడులు, ఆన్ లైన్ గేమ్ లతో సైబర్ మోసగాళ్లు  మోసాలకు పాల్పడుతున్నారని కమిషనర్‌ అన్నారు.  సింగపూర్, హాంకాంగ్ నుంచి నిందితులు ఫోన్లు చేస్తూ..  భారీగా లాభాలంటూ నమ్మించి మోసాలకు దిగుతారన్నారని చెప్పారు.  సోషల్ మీడియాలో నిందుతులు కనెక్ట్ అవుతారని పాస్ వర్డ్స్, ఓటీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  సైబర్ నేరగాళ్లపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.  నిందుతులను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.