ఆన్లైన్ ట్రోలర్స్పై యాక్షన్ తీసుకోండి..సీపీకి మహిళా ఆన్లైన్జర్నలిస్టుల ఫిర్యాదు

ఆన్లైన్ ట్రోలర్స్పై యాక్షన్ తీసుకోండి..సీపీకి మహిళా ఆన్లైన్జర్నలిస్టుల ఫిర్యాదు
  • దుర్భాషలు, బెదిరింపులు ఎక్కువవుతున్నాయి
  • స్వేచ్ఛగా పని చేసుకోలేకపోతున్నం
  • సీపీకి మహిళా ఆన్​లైన్​జర్నలిస్టుల ఫిర్యాదు

హైదరాబాద్​ సిటీ, వెలుగు : మహిళా జర్నలిస్టులను ఆన్‌‌లైన్‌‌లో బెదిరింపులు, దుర్భాషలాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ సీపీ వి.సి.సజ్జనార్ హెచ్చరించారు. మంగళవారం పలువురు  మహిళా జర్నలిస్టులు సీపీ సజ్జనార్​ను కలిశారు. తమను ఆన్​లైన్​లో ట్రోలింగ్‌‌ చేస్తూ వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 
 
ఈ సందర్భంగా ట్రోలింగ్ కు సంబంధించిన పలు వీడియోలను కమిషనర్‌‌కు చూపించారు. వాటి వల్ల తాము స్వేచ్ఛగా పని చేసుకోలేకపోతున్నామన్నారు. దీనిపై స్పందించిన సజ్జనార్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న లింకులు, స్క్రీన్‌‌షాట్లు, వీడియోలను తన ఆఫీసులో ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
 
తర్వాత జర్నలిస్టుల బృదం విమెన్​కమిషన్​చైర్​పర్సన్​నేరెళ్ల శారదను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. ఈ ట్రోలింగ్‌‌ తమ వృత్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రెస్​ క్లబ్​ వైస్​ ప్రెసిడెంట్​అరుణ, సభ్యులు రచన, ఉమ, రాజేశ్వరి, సీనియర్​ జర్నలిస్టులు వనజ, యశోద, సరస్వతీ రమ, మల్లీశ్వరి, కృష్ణజ్యోతి, అరవింద, చందుతులసి, సూర్యకుమారీ, భవాని పాల్గొన్నారు.