
రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ ఆర్. విజయానంద్ మంగళవారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో వివేక్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అలాగే లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ప్రతినిధులు జస్మత్ పటేల్, రిదేశ్ జాగీర్దార్, ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే.జైన్, నారాయణ్ సేవ సంస్థాన్ ప్రతినిధులు మహేనర్ సింగ్, డాక్టర్ హరికుమార్ కలిసి శాలువాతో సన్మానించారు.