సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించండి : రోనాల్డ్ రాస్

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించండి : రోనాల్డ్ రాస్
  • హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల కమిషన్ రూల్స్ మేరకు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని  హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు.  శనివారం ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)లో భాగంగా వల్నరబుల్ (సమస్యాత్మక)లొకేషన్లు, ఎన్నికల ఖర్చుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ... వల్నరబుల్ పోలింగ్ లొకేషన్లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని గుర్తించారో వాటిని మళ్లీ పరిశీలించి రూల్స్  మేరకు మరోసారి లొకేషన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

నవంబర్ 3న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్నందున నియోజకవర్గ స్థాయిలో పోలీస్ సిబ్బంది నియామకం చేపట్టాలని సిటీ సీపీ సందీప్ శాండిల్యాను ఆయన కోరారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులకు పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేయాలన్నారు.  వివిధ నిఘా బృందాలు సీజ్ చేసిన మొత్తం నియోజకవర్గాల వారీగా నివేదిక అందజేయాలని ఎంసీసీ నోడల్ అధికారిని రోనాల్డ్ కోరారు.  

అనంతరం సీపీ సందీప్ శాండిల్యా, లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్‌‌‌‌తో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ వెహికల్స్ కు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.