1,147 స్కూళ్లు  ఇంకా తెరుచుకోలె 

1,147 స్కూళ్లు  ఇంకా తెరుచుకోలె 
  • వీటిలో 1,082 ప్రైవేటువే.. మిగతావి ఎయిడెడ్ స్కూళ్లు 
  • రెండో రోజు 28.12 శాతానికి పెరిగిన అటెండెన్స్
  • ఓపెన్ కాని ప్రైవేట్ బడుల్లో హైదరాబాద్ జిల్లావే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫిజికల్ క్లాసులకు సర్కారు అనుమతించినా పూర్తిస్థాయిలో ఇంకా స్కూళ్లు ఓపెన్ కాలేదు. రెండోరోజు గురువారం నాటికి 1,147 స్కూళ్లు తెరవలేదు. వీటిలో సర్కారు బడి ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మరోపక్క అటెండెన్స్ గురువారం 28.12 శాతానికి పెరిగింది. ఫస్ట్ రోజు 11.37 లక్షల మంది బడికి వస్తే, ఆ సంఖ్య రెండో రోజు 14.76 లక్షలకు చేరింది.
37,768 సూళ్లు.. 52,52,303 మంది స్టూడెంట్లు
రాష్ట్రంలో గవర్నమెంట్, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు 37,768 ఉండగా, వాటిలో 52,52,303 మంది స్టూడెంట్లున్నారు. అయితే గురువారం వీటిలో 36,621 స్కూళ్లు తెరుచుకోగా, 14,76,874 మంది ఫిజికల్ క్లాసులకు అటెండ్ అయ్యారు. రెండోరోజు గవర్నమెంట్ స్కూళ్లలో పది శాతం స్టూడెంట్ల అటెండెన్స్ పెరిగింది. స్టేట్​లో మొత్తం 26,285 స్కూళ్లుండగా, వాటిలో 19,95,319 మంది చదువుతున్నారు. వీరిలో 7,74,502 (38.82%) మంది హాజరయ్యారు. ఎయిడెడ్ స్కూళ్లలో 668 బడుల్లో 83,500 మందికి గానూ 12,559 (15.04%) మంది అటెండ్​అయ్యారు.  ప్రైవేటు స్కూళ్లలో 10,815 బడుల్లో 31,73,484 మంది ఉండగా, వారిలో 6,89,813 (21.74%) మంది హాజరయ్యారు. రెండోరోజు కూడా బడుల్లో శానిటైజేషన్​ నిర్వహణపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించారు. స్టూడెంట్ల అటెండెన్స్​లో టాప్ లో రాజన్న సిరిసిల్ల (40.42%) , హనుమకొండ (40.31%) ఉండగా, లాస్ట్ లో మేడ్చల్​లో (17.26%), పెద్దపల్లి(17.88%) జిల్లాలున్నాయి. సర్కారు బడుల్లో మహబూబాబాద్ జిల్లాలో 50.7 శాతం స్టూడెంట్లు హాజరు కాగా, హైదరాబాద్​లో 27.01% మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు. 


ఇంటర్​ లో 20.22 శాతం హాజరు
సర్కారు ఇంటర్మీడియెట్ కాలేజీల్లో స్టూడెంట్ల అటెండెన్స్ రెండో రోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం 15.71 శాతం ఉండగా, గురువారం నాటికి 20.22శాతానికి చేరింది. కాగా ఇంటర్​లోనూ చాలా ప్రైవేటు కాలేజీలు ఓపెన్ కాలేదని అధికారులు తెలిపారు.


వివిధ కారణాలతో..
ఫిజికల్ క్లాసులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా, వివిధ కారణాలతో ఇంకా 1,147 స్కూళ్లు ఓపెన్ కాలేదు. సర్కారు బడులు అన్నీ తెరుచుకోగా, 1,082 ప్రైవేటు స్కూళ్లు ఇంకా తెరవలేదు. ఉన్నాయి. వీటిలో సగం కంటే ఎక్కువ స్కూళ్లు(665) హైదరాబాద్ జిల్లాలోనివే. ఇక ఎయిడెడ్ స్కూళ్లలో 668 స్కూళ్లకు గానూ 603 బడులు మాత్రమే రీ ఓపెన్ అయ్యాయి. మొత్తం 33 జిల్లాల్లో పది జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరుచుకోలేదు.