దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మూడు రోజులు బంద్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మూడు రోజులు బంద్

వాహనదారులకు అలెర్ట్‌.. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని ఈరోజు (ఏప్రిల్‌) నుంచి మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్‌ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లతో తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ తెలిపారు. భారీ వాహనాలు, ప్రత్యేక పరికరాలు, యంత్రాలు కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి వస్తుందని, ఆ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ తెలిపారు. బ్రిడ్జి తనిఖీల కోసం భారీ బరువు ఉన్న క్రేన్లు, వాహనాలు, యంత్రాలు, పరికరాలను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి వస్తుందని, ఆ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, అందుకే మూడు రోజుల పాటు కేబుల్ బ్రిడ్జిని మూసివేయనున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు.

https://youtu.be/pXsKkjKV9RU

మూడు రోజుల పాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్‌ సూచించారు. మరోవైపు ఈ మూడు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. రోడ్‌ నం.45 నుంచి కేబుల్‌ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను రెండు మార్గాల్లో మళ్లిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే ఐకియా నుంచి జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు కోరారు.