
హైదరాబాద్‌సిటీ, వెలుగు: అగ్నిప్రమాదంలో మృతి చెందినవారిలో రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లికి చెందిన 10 మంది ఉన్నారు. ఉప్పర్‌పల్లి గౌతమ్‌నగర్‌లో ఉంటున్న ప్రహ్లాద్ మోదీ, మున్ని, వర్ష, పంకజ్, అనుయన్, ఇద్దు, ఇరాజ్, అభిషేక్, రాజేందర్, సుమిత్ర చనిపోయారు. వీరి మృతదేహాలను గౌతమ్నగర్కు తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి మహమూద్‌అలీ ఇక్కడికి చేరుకొని.. నివాళులర్పించారు. పురానాపూల్‌లోని శ్మశానవాటికలో పది మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.