హైదరాబాద్ లో పూడిక, చెత్తాచెదారం తొలగించండి...ప్రమాదకర ప్రాంతాల్లో వార్నింగ్ బోర్డులు పెట్టండి

హైదరాబాద్ లో పూడిక, చెత్తాచెదారం తొలగించండి...ప్రమాదకర ప్రాంతాల్లో వార్నింగ్ బోర్డులు పెట్టండి
  •     ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
  •     వరద ముంపు ప్రాంతాల్లో కమిటీ పర్యటన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో వర్షాకాల సన్నద్ధత, వరద ముంపు నివారణ చర్యలను సమీక్షించేందుకు ఎంఎంసీ పరిధిలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం బుధవారం సిటీలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను విజిట్​చేసింది. బేగంపేటలోని చికోటి గార్డెన్స్, ప్రకాశ్ నగర్, ఉప్పల్ జంక్షన్, ఎల్బీనగర్​ఎక్స్ రోడ్స్, వనస్థలిపురంలోని కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎమ్ మాల్ సమీప ముంపు ప్రాంతాలను పరిశీలించారు. 

పర్యటనలో డీజీపీ సీవీ ఆనంద్, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి,  ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మల్కాజిగిరి సీపీ సుమతి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఫీల్డ్​విజిట్​చేశామని నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న పూడిక, చెత్తాచెదారాన్ని తక్షణమే తొలగించాలని అధికారులను సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. డీప్ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్స్, ప్రమాదకర ప్రాంతాల వద్ద బారికేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, హెచ్చరిక బోర్డులు, భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు.