సిటీపై పొగమంచు

సిటీపై పొగమంచు

గ్రేటర్ సిటీపై పొగ మంచు కమ్ముకుంది. తెల్లవారుజామున, సాయంత్రం వేళ్లలో పొగ మంచు కురుస్తుంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఉదయం తొమ్మిది దాటినా పొగమంచు వదలడంలేదు. వివిధ పనులపై బయటకు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడంలేదు. వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలు నడపాల్సి వస్తుంది. సాయంత్రమైతే  కొందరు చలిని తట్టుకోలేక వెచ్చదనం కోసం తెల్లవారుజామున చలిమంట వేసుకుంటున్నారు. తీవ్ర చలి కారణంగా పిల్లలు, వృద్ధులు సీజనల్ వ్యాధుల బారిన పడుతుండగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.