రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సెస్ ఆఫీస్‌లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు మంగళవారం సోదాలు చేశారు. సెస్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక రికార్డులను తనిఖీ చేసినట్లు సమాచారం. సెస్ ఆఫీస్‌లోని సిబ్బంది నుంచి వివిధ రికార్డులు, దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడుల్లో విజిలెన్స్ సీఐ అనిల్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర ఆఫీసర్లు ఉన్నారు.
