Formula E race: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ- రేస్ రద్దు

Formula E race: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ- రేస్ రద్దు

వచ్చే నెల ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్మూలా ఈ -రేస్ రద్దు చేస్తున్నట్టు ఎఫ్ఏఈ ప్రకటించింది. ఈ -రేస్ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ -రేస్ నిర్వహించేలా ఒప్పందం జరిగింది. అనంతరం గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. వారు ఆసక్తి చూపకపోవడంతో నిర్వాహకులు ఈ -రేస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మున్సిప‌ల్ శాఖ‌.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్లడించారు. అందుకుగానూ హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చ‌ట్టాల ప్రకారం చ‌ర్యలు తీసుకోనున్నట్లు ఎఫ్ఈవో ఒక ప్రకటనలో పేర్కొంది.