ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. 2025 నవంబర్ 19వ తేదీన సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వేడుకలకు హాజరయ్యారు.
హిల్ వ్యూ స్టేడియంలో వేడకల్లో భాగంగా శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు మోదీ. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కుల్వంత్ హాల్ లో ప్రధాని మోదీ కాసేపు ధ్యానం చేసి సత్యసాయిని స్మరించుకున్నారు.
మరోవైపు సత్యసాయి శతజయంతి సందర్భంగా బాబా సేవలకు గుర్తింపుగా రూ.100 నాణెం, 4 తపాలా బిల్లలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. పుట్టపర్తిలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ, క్రీడా, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
