హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. వాతావరణశాఖ బుధవారం నగరానికి ఎల్లో అలెర్ట్(10 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రత) జారీ చేసింది. పటాన్ చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, అల్వాల్ ప్రాంతాల్లో మరింత కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం పఠాన్ చెరువు ప్రాంతంలో కనిష్టంగా 10.2 డిగ్రీలు, రాజేంద్రనగర్ లో 12 డిగ్రీలు, హయత్ నగర్ లో 12.6 డిగ్రీలు, బేగంపేటలో 14.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు చూస్తే అత్యధికంగా 28.8 డిగ్రీలుగా నమోదైంది.
