విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ కు దేహశుద్ధి.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ కు దేహశుద్ధి.. నాగర్ కర్నూల్  జిల్లాలో ఘటన

కోడేరు, వెలుగు: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను తల్లిదండ్రులు, గ్రామస్తులు చితకబాదారు. నాగర్ కర్నూల్  జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలోని హైస్కూల్ లో పని చేస్తున్న ఇంగ్లీష్  టీచర్  పవన్  గత కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం ఎంఈవో శ్రీనివాసరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్  నారాయణమ్మకు ఫిర్యాదు చేశారు. 

ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు. ఇదిలాఉంటే స్కూల్  అయిపోయాక  సదరు టీచర్​ ‘నా పైనే కంప్లైంట్  చేస్తారా? మీ అంతు చూస్తా’ అని అనడంతో  కోపోద్రికులైన తల్లిదండ్రులు, గ్రామస్తులు అతడిని  చితకబాదారు.