సూర్యాపేట, వెలుగు: డ్రగ్స్‌నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ నరసింహ అన్నారు. మాదక ద్రవ్యాల విముక్తి భారత దేశ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన నషా ముక్తా భారత్‌అభియాన్‌ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్‌కార్యాలయంలో మాదకద్రవ్యాల నిర్మూలనకై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ నరసింహతో కలిసి, పోలీస్ అధికారులు, సిబ్బంది సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పౌరుడు, ముఖ్యంగా ప్రతి పోలీసు యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్‌గా పని చేయాలని పిలుపునిచ్చారు.యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీఆర్బీ, డీఎస్పీ రవి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో..
నశా ముక్త్ భారత్‌అభియాన్5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్‌కళాశాలలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి నర్సింహరావు, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లక్ష్మణ్‌నాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి దిశగా కృషి చేయాలన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ రాజు , సీడీపీవో కిరణ్మయి, వినోద్‌కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డుల సంక్షేమానికి కృషి
హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. మోతె పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు అధికారి సైదులు సింగ్‌తన అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో వైద్య ఖర్చులు పెట్టుకున్నట్లు దరఖాస్తు చేసుకోగా జిల్లా హోంగార్డు సంక్షేమ నుంచి మెడికల్ రీయింబర్స్‌మెంట్‌గా నగదును అందజేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సిబ్బంది నేరుగా తెలపొచ్చని కోరారు. జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, హోంగార్డ్స్ ఇన్‌చార్జి ఆర్‌ఎస్‌ఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు
