కొత్తపల్లి, వెలుగు: శ్రీనివాస రామనుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన పోటీ పరీక్షలో కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్ విద్యార్థులు సత్తా చాటినట్లు స్కూల్ చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు.
ఈ టెస్ట్‌లో బి.శ్రీక్షిత, జె.యశ్వంత్‌రెడ్డి, జి.శ్రీయాన్రెడ్డి, పి.సాద్విని, ఎ.రితిక, జి.సహాంస్, ఎన్.సహార్ష్, ఎం.శ్రేయాన్కార్తీక్ ఫస్ట్ లెవల్పూర్తిచేసుకుని సెకండ్ లెవల్‌కు సెలెక్ట్ అయినట్లు తెలిపారు.
