అల్లూరి జిల్లా: మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్పై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు వివరాలను వెల్లడించారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా , అతని భార్య రాజేతో పాటు మరో నలుగురు మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్లో చనిపోయినట్లు ఆయన తెలిపారు. మరో నలుగురు మావోలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు.
రంపచోడవరం పరిధిలోని మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల భారీ కూంబింగ్ నిర్వహించారని.. మంగళవారం ఉదయం మారేడుమిల్లి మండల ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే.. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కూంబింగ్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని, గత కొన్ని వారాలుగా.. ఏపీ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు ప్రాంతాల దగ్గరలో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయని వివరించారు. ఎన్‌కౌంటర్ స్పాట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాల వివరాలను మహేష్ చంద్ర లడ్డా బయటపెట్టారు.
ఎన్ కౌంటర్ స్పాట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు:
* రెండు AK-47లు
* ఒక పిస్టల్
* ఒక రివాల్వర్
* ఒక సింగిల్ బోర్ నాటు తుపాకీ
స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులు:
* ఎలక్ట్రికల్ డిటోనేటర్లు
* నాన్-ఎలక్ట్రికల్ డిటోనేటర్లు
