ప్రజలను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాను: ప్రశాంత్ కిశోర్

ప్రజలను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాను: ప్రశాంత్ కిశోర్

పాట్నా: ప్రజలను అంచనా వేయడంలో తాను ఫెయిల్​అయ్యానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ ​కిశోర్​అన్నారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో అతని పార్టీ ఘోర పరాజయం తర్వాత తొలిసారి ఆయన స్పందించారు. మంగళవారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు. 

తమ ప్రయత్నాలను.. ఆలోచనలను ప్రజలకు వివరించే విధానంలో ఎక్కడో తప్పు జరిగిందని పేర్కొన్నారు. తాము నిజాయితీతో ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేకపోయామన్నారు. పార్టీ ఘోర వైఫల్యానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నట్టు చెప్పారు. దీన్ని ఒప్పుకోవడంలో ఎలాంటి బేషజం లేదన్నారు. 

వ్యవస్థాపరమైన మార్పు పక్కనపెడితే.. ప్రభుత్వంలో మార్పును కూడా తీసుకురాలేకపోయామన్నారు. కానీ, బిహార్ రాజకీయాలను కొంత మార్చడంలో తమ పాత్ర ఉందని తెలిపారు. ప్రభుత్వాన్ని మార్చలేకపోయినందుకు తాను ఒక్కరోజు మౌన వ్రతం చేపట్టనున్నట్టు ప్రకటించారు.