జీహెచ్ఎంసీ...పర్యావరణను పరిరక్షణ.. నగరంలో 4 లక్షల మట్టి వినాయక విగ్రహాలు పంపిణి

జీహెచ్ఎంసీ...పర్యావరణను పరిరక్షణ..  నగరంలో 4 లక్షల మట్టి వినాయక విగ్రహాలు పంపిణి

హైదరాబాద్ సిటీ, వెలుగు: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం 4 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేసేందుకు బల్దియా కసరత్తు చేస్తున్నది. పీసీబీ, హెచ్ఎండీఏతో కలిసి నగరంలోని ఈ మట్టి విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గ్రేటర్​లో 150 వార్డులుండగా, వార్డుకు 2,500 నుంచి 3 వేల చొప్పున ఉచితంగా మట్టి విగ్రహాలు ఇవ్వనున్నది. 

ఇందులో బల్దియా లక్ష విగ్రహాలను కొనుగోలు చేయనుండగా, 2లక్షల విగ్రహాలను హెచ్ఎండీఏ నుంచి, మరో లక్ష పీసీబీ నుంచి ఇప్పించనున్నది. 8 ఇంచులు, ఫీట్, 1.5 ఫీట్ల ఎత్తులో ఈ విగ్రహాలను తయారు చేయనున్నారు. ఈ వారంలో టెండర్లు పూర్తి చేసేందుకు ప్లాన్​చేస్తున్నారు. యేటా విగ్రహాల్లో చాలా వరకు డ్యామేజ్​వస్తుండడంతో ఈసారి అలా జరగకుండా టెండర్లు పొందినవారికి సూచనలు చేయనున్నారు.