
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో గంజాయి హోల్‌సేల్ వ్యాపారిగా పేరుగాంచిన ధూల్‌పేటకు చెందిన లఖాన్ సింగ్‌పై ఎక్సైజ్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈయన ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి స్థానికంగా అమ్ముతుంటాడు. ఎనిమిది నెలల్లో మూడుసార్లు ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి బృందానికి పట్టుబడ్డాడు. వివిధ పోలీస్, ఎక్సైజ్ స్టేషన్లలో 30కు పైగా కేసులు ఉన్నాయి.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం సిఫార్సుతో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పీడీ యాక్ట్ నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ధూల్‌పేట ఎక్సైజ్ ఎస్సై మధుబాబు పీడీ యాక్ట్ ఉత్తర్వులను లఖాన్ సింగ్‌కు అందించారు.