
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( హైడ్రా)కి సర్కారు రూ.25 కోట్లు విడుదల చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో హైడ్రాకు మొత్తం రూ.100 కోట్లు కేటాయించగా, ముందుగా రూ.25 కోట్లు రిలీజ్చేసినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి తెలిపారు.