మా ఆఫీసుల ముందుకొస్తే.. తాట తీస్తం

మా ఆఫీసుల ముందుకొస్తే.. తాట తీస్తం
  • కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ నేతలకు బీజేపీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాంచందర్ రావు హెచ్చరిక
  • ఉపాధి హామీలో ‘రామ్’ పేరుంటే ఎందుకంత అక్కసు అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ‘‘మా ఆఫీసుల ముందు నిరసనలు చేసే సంస్కృతి మంచిది కాదు. పద్ధతి మార్చుకోకపోతే ఊరుకునేది లేదు.. తాట తీస్తం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రాంచందర్ రావు హెచ్చరించారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంపేరు మార్పు విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. పథకం పేరులో ‘రామ్’అనే పదం ఉండటం వల్లే కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. 

గాంధీజీ కలలు కన్న రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం కోసమే బీజేపీ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ‘రామ్’అనే పేరు వింటేనే ఎందుకంత వణుకు అని ప్రశ్నించారు. గాంధీపై అంత ప్రేమ ఉంటే.. సోనియా, రాహుల్ తమ పేర్ల చివరన ఉన్న ‘గాంధీ’ని తొలగించుకోవాలన్నారు.

అవి కేవలం రాజకీయ లబ్ధి కోసం పెట్టుకున్న పేర్లే తప్ప.. వాళ్లు అసలు సిసలు గాంధీ వారసులు కాదని, ఫేక్ గాంధీలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీ రామారావు పేరున్న పథకాలకు రాజీవ్ గాంధీ పేరు మార్చినప్పుడు అది తప్పు అనిపించలేదా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.