- పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ పంజా విసిరే చాన్స్ ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు. దీంతో ప్రజలు అలర్ట్గా ఉండాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని.. అయితే, చల్ల గాలుల కారణంగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి వైరల్ లక్షణాలు వేగంగా వ్యాపిస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, 65 ఏండ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.
