- రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ చామల వినతి
న్యూఢిల్లీ, వెలుగు: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం సమీపంలోని బొమ్మైపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ కల్పించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్రమంత్రిని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
భువనగిరి సమీపంలోని రెండో రైల్వే స్టేషన్‌గా ఉన్న బొమ్మైపల్లి, సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వెళ్లే రైళ్లకు ముఖ్యమైన జంక్షన్ అయినప్పటికీ.. ప్రస్తుతం అక్కడ ఏ ప్రధాన రైలుకూ హాల్ట్ లేకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని అశ్వినీ వైష్ణవ్‌కు వివరించారు.
