హైదరాబాద్‌‌‌‌లో తైక్వాండో ప్రీమియర్ లీగ్ రెండో అంచె

హైదరాబాద్‌‌‌‌లో తైక్వాండో ప్రీమియర్ లీగ్ రెండో అంచె
  • డిసెంబర్ 19 నుంచి 21 వరకు పోటీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  తైక్వాండో ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌ (టీపీఎల్​) తొలి సీజన్‌‌‌‌ రెండో అంచెకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు సిటీలో పోటీలు జరుగతాయని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆర్గనైజర్స్‌‌‌‌ వెల్లడించారు. రెండో అంచెను  ప్రత్యేకంగా టీనేజ్‌‌‌‌ క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

58.1 కేజీ నుంచి 67.9 కేజీల విభాగాల్లో పోటీలు ఉండాయన్నారు. అలాగే, ఈసారి బెస్ట్ ఇండియన్ మేల్, ఫీమేల్ ప్లేయర్ల కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతాయని వెల్లడించారు. పోటీల్లో హైదరాబాద్ గ్లైడర్స్, హర్యానా హంటర్స్, బెంగళూరు నింజాస్, ఢిల్లీ వారియర్స్, మహారాష్ట్ర అవెంజర్స్, అస్సాం హీరోస్,  గుజరాత్ థండర్స్, రాజస్థాన్ రెబెల్స్‌‌‌‌ బరిలో నిలిచాయి.