హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఎల్ఐజీ(లో ఇన్ కం గ్రూప్) ఫ్లాట్ల నిర్మాణానికి పేరు పెట్టాలని పబ్లిక్‌ను హౌసింగ్ బోర్డు కోరింది. ఇందుకు గడువు గత నెల 28తో ముగిసింది. అయితే, దీనికి పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 5 రోజుల్లో 14 వేల మంది పేర్లు సూచిస్తూ హౌసింగ్ బోర్డుకు మెయిల్ చేశారు.
ప్రభుత్వం ఫైనల్ చేసిన పేరు సూచించిన వ్యక్తికి రూ.లక్ష ప్రైజ్ మనీ ఇస్తామని హౌసింగ్ బోర్డు ప్రకటించింది. వీటిలో హౌసింగ్ బోర్డు అధికారులు 150 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది. వీటిలో కొన్ని పేర్లను ఖరారు చేసి సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పేరును ఖరారు చేస్తామని హౌసింగ్ బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. త్వరలో ఈ ఫ్లాట్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.
