ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు మరో ఛాన్స్

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు  చెల్లించేందుకు మరో ఛాన్స్
  • రూ.2 వేల లేట్ ఫీజుతో 31 వరకు అవకాశం 

హైదరాబాద్, వెలుగు: వచ్చే మార్చిలో  జరగబోయే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. 2 వేల ఫైన్ తో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ గడువు వర్తిస్తుందని తెలిపారు. ఇదే చివరి అవకాశమని, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని చెప్పారు. కాలేజీ ప్రిన్సిపాల్స్ వెంటనే విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరించి, నిర్ణీత గడువులోగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెల్లించాలని ఆదేశించారు.