ఆడోళ్లకు సేఫ్ సిటీ హైదరాబాద్

ఆడోళ్లకు సేఫ్ సిటీ హైదరాబాద్

దేశంలో మహిళలకు అత్యంత అనుకూలమైన నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. టాప్‌ సిటీస్‌ ఫర్‌ వుమెన్‌ ఇన్‌ ఇండియా పేరుతో అవతార్‌ గ్రూప్‌ చేసిన సర్వేలో భాగ్యనగరం ఫోర్త్ ప్లేస్లో నిలిచింది. మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత తదితర అంశాలను విశ్లేషించి అవతార్‌ గ్రూప్‌ ఈ నివేదిక రూపొందించింది. లివింగ్‌ ఇండెక్స్‌, జాతీయ గణాంకాలు, నేర రికార్డులు, మహిళా శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదిక వంటి 200పైగా అంశాలను విశ్లేషించి దేశంలోనే అనేక నగరాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ ర్యాంకుల్లో మహిళలకు భద్రమైన నగరాల్లో చెన్నై అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత పుణె, బెంగళూరు, హైదరాబాద్‌ నిలిచాయి.. 5వ స్థానంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉంది. ఈ ర్యాంకుల జాబితాలో ఢిల్లీ 14వ స్థానంలో ఉండటం గమనార్హం.

సౌత్ సిటీస్ బెస్ట్ సిటీస్..

దేశంలో మహిళలకు అనుకూలంగా ఉండే నగరాల విషయంలో అవతార్‌ గ్రూప్‌ ఏడాది పాటు 111 నగరాల్లో సర్వే చేసింది. 9 నగరాలు మాత్రమే సిటీ ఇంక్లూజన్‌ స్కోర్‌లో 60కి 50 పాయింట్లను దక్కించుకున్నాయి. ఇందులో సౌతిండియాలోని నగరాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సర్వేలో దేశంలోని అనేక రాష్ట్రాల రాజధానులు కనీసం 25 స్కోర్ కూడా దాటలేకపోయాయి. ఇక మహిళలకు అత్యంత అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు... అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్‌ టాప్‌ ప్లేస్‌ లో నిలిచింది. 

అవతార్ గ్రూప్ సర్వే ప్రకారం 10 లక్షలకు పైగా జనాభా ఉన్న టాప్ 25 నగరాల్లో  చెన్నై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, వైజాగ్, కోల్ కతా, కొయంబత్తూర్, మధురై టాప్ 10లో నిలిచాయి. ఇక 10 లక్షలకు తక్కువ జనాభా ఉన్న 25 నగరాల్లో తిరుచిరాపల్లి, వెల్లూర్, ఈరోడ్, సేలమ్, తిరుపూర్, పుదుచ్చేరి, సిమ్లా, మంగళూరు, తిరువనంతపురం, బెలగావి టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. నార్త్ ఇండియాలో  ఢిల్లీ, శ్రీనగర్, అమృత్‌సర్ అక్కడి టాప్ 3 క్యాటగిరీలో నిలిచాయి.