
న్యూఢిల్లీ, వెలుగు: ఫార్ములా- ఈ కార్ రేసింగ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రారంభం కానున్న ఈ ఈవెంట్‌కు 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో అయ్యర్, మన రాష్ట్ర స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ఫార్ములా- ఈ ప్రిక్స్ ఈవెంట్‌ను ప్రపంచంలో 12 దేశాలు నిర్వహిస్తుండగా.. ఈ ఈవెంట్ తొమ్మిదో సీజన్‌కు హైదరాబాద్ వేదిక కానుండటం విశేషం.
వచ్చే 4 ఏండ్లలోనూ హెచ్ఎండీఏ, గ్రీన్ కో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోనే ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకర్తా, కేప్ టౌన్, మొనాకో, దిరియా సిటీల్లో మాత్రమే ఈ పోటీలు నిర్వహించారు. ‘ఫార్ములా ఈ-ప్రిక్స్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌తో గ్లోబల్ సిటీల స్థాయికి హైదరాబాద్ చేరుకున్నట్లయిందని మంత్రి కేటీఆర్ మెస్సేజ్‌లో తెలిపారు. ఈవెంట్‌ను సమర్ధంగా నిర్వహిస్తామన్నారు.