హైదరాబాద్, వెలుగు: రెండు లక్షలకుపైగా నగల డిజైన్లతో హైదరాబాద్ జ్యువెలరీ పెరల్ అండ్ జెమ్ ఫెయిర్ 2024ను (హెచ్జీఎఫ్) నగరంలోని హైటెక్స్‌లో శనివారం ప్రారంభించారు. దేశం మొత్తం ఆభరణాల డిమాండ్‌లో హెచ్జీఎఫ్కు 40శాతం వాటా ఉందని నిర్వాహకులు తెలిపారు. 2030 నాటికి రూ. 6.2 లక్షల కోట్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయానికి తాము మద్దతు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జ్యువెల్స్ ఆఫ్ ఎంపవర్‌మెంట్‌పై ప్యానెల్ చర్చను నిర్వహించారు.
