హైదరాబాద్ మహంకాళిలో భారీ చెట్టు తరలింపు... ట్రాఫిక్ తిప్పలకు చెక్

హైదరాబాద్ మహంకాళిలో భారీ చెట్టు తరలింపు... ట్రాఫిక్ తిప్పలకు చెక్

పద్మారావునగర్​, వెలుగు: మహంకాళి ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ప్యాట్నీ జంక్షన్​ సమీపంలో ఓ పెల్టో ఫోరం చెట్టు భారీగా పెరగడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్​ ఉన్నతాధికారుల సూచనల మేరకు నార్త్ జోన్​ ట్రాఫిక్​ ఏసీపీ శంకర్​ రాజు ఆధ్వర్యంలో మంగళవారం చెట్టును నుంచి తొలగించారు. 

వెటా ఫౌండేషన్​ సహకారంతో జీహెచ్​ఎంసీ సిబ్బంది ఆ చెట్టును జాగ్రత్తగా సికింద్రాబాద్​ మహబూబ్​ కాలేజీ ఆవరణకు తరలించారు. కార్యక్రమంలో ట్రాఫిక్​ పోలీస్​ అధికారులు నజీముద్దీన్​, శ్రీధర్​, మహేశ్, మోహిత్ , సత్యనారాయణ పాల్గొన్నారు.