
హైదరాబాద్,వెలుగు: ‘నా బండిపై ముగ్గు రం వెళ్తున్నట్టు చలాన్ పంపించారు. ఫొటో కరెక్ట్ చూడండి. ఇద్దరమే ఉన్నాం’ అని ట్విటర్ కంప్లయింట్ చేశాడా యువకుడు. ‘అయ్యయ్యో..సారీ మేమే కన్ఫ్యూజ్ అయ్యాం. ఏం పర్లేదు.. మీరు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి విత్ అవుట్ హెల్మెట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం.’ అంటూ సమాధానమిచ్చారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 13న ముబీన్ అనే యువకుడు కొంపల్లి చౌరస్తాలో వెళ్తుండగా లోకల్ కానిస్టేబుల్ ఫొటో తీశాడు. అందులో ముందు బండిపై వెళ్తున్న వ్యక్తి కూడా ముబీన్ వెహికల్ పైనే కూర్చున్నట్టు వచ్చింది. దీంతో.. రూ.1235 చలాన్ పంపారు. ఈ విషయంపై ముబీన్ బుధవారం ట్విటర్ కంప్లయింట్ ఇవ్వగా పై విధంగా స్పందించారు పోలీసులు.