వైరల్ వీడియో: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. అమెజాన్ వదిలి ఉబర్ డ్రైవర్ అవతారం.. ఇతను చెప్పింది వింటే..

వైరల్ వీడియో: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. అమెజాన్ వదిలి ఉబర్ డ్రైవర్ అవతారం.. ఇతను చెప్పింది వింటే..

సాఫ్ట్ వేర్  ఉద్యోగులు లేఆఫ్స్ భయంతో గుట్టుమిట్టు మంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలు పోయి కొందరు రోడ్డున పడితే.. మరి కొందరు లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ అయ్యి.. సేఫ్ సైడ్ లో ఉంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక హైదరాబాదీ ఉబర్ డ్రైవర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఉబర్ కార్ బుక్ చేసుకున్న ఒక ప్యాసెంజర్.. సరదగా డ్రైవర్ తో మాట కలపగా అతను చెప్పిన ముచ్చట్లు విని షాకింగ్ కు గురైంది. అతడు ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని చెప్పడంతో ఆశ్చర్యంతో.. వివరాలు సేకరించింది. అది కూడా అమెజాన్ కంపెనీ అనటంతో.. అంత మంచి కంపెనీ నుంచి ఎందుకు బయటకు వచ్చారంటే.. అతడు చెప్పిన మాటలు ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ గా మారాయి. 

చేతన్ సింగ్ అనే ప్యాసెంజర్.. పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఉబర్ డ్రైవర్ పేరు కుమార్. 2014 లోనే ఉమెజాన్ కంపెనీని వదిలి డ్రైవర్ గా అవతారం ఎత్తినట్లు చెప్పాడు. దాదాపు పదేళ్లు గడిచాయి.. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. ఎలాంటి అసంతృప్తి లేదు.. అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 

  • చాలా ఎంజాయ్ చేస్తున్నాను:

కుమార్ డ్రైవింగ్ వృత్తిని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు. తనకు ఇది ఒక అవకాశంగా చెప్పుకున్నాడు. కొత్త కొత్త వారిని కలుస్తాను.. వాళ్ల స్టోరీస్ వింటాను.. ప్రతి రోజు సిటీలో వివిధ ప్లేస్ లకు వెళ్లి వస్తుంటాను.. హైదరాబాద్ ను రోజు చూడటం కొత్తగా, థ్రిల్ గా ఉంటుంది.. ఎందుకంటే నేను హైదరాబాదీని కాబట్టి.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 23 వేల 600 ట్రిప్స్ కంప్లీట్ చేసినట్లు చెప్పాడు. ప్రతి రైడ్ ఎంజాయ్ చేస్తానని అన్నాడు. 

  • ఎందుకు వదలాల్సి వచ్చింది..?

2014లో జాబ్ క్విట్ అయినట్లు చెప్పాడు కుమార్. డ్రైవింగ్ ప్లాట్ ఫామ్స్ అప్పుడప్పుడే వస్తున్న సమయంలో.. కొత్త అవకాశంగా.. ఛాలెజింగ్ గా.. భావించి కెరీర్ ను ఎంచుకున్నట్లు చెప్పాడు కుమార్. సాఫ్ట్ వేర్ జాబ్ ను ఎందుకు వదిలానా అనే బాధ తనకు ఎప్పుడూ లేదని అన్నాడు. 

ఈ వీడియో పోస్ట్ చేసిన చేతనా సింగ్.. చాలా మంది కెరీర్, జాబ్స్.. తమకు ఉన్న బాధ్యతల ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటారు. కానీ కుమార్ తనను ఏదైతే హ్యాపీగా ఉంచుతుందో ఆ రంగాన్ని ఎంచుకున్నాడు. ఎవరు చిన్నచూపు చూసినా.. తనకు నచ్చిన పని చేస్తూ హ్యాపీ ఉన్నాడని ఇన్ స్టా, ఎక్స్ లో పోస్ట్ చేయగా అది వైరలైంది. 

  • రియాక్షన్స్:

ఈ పోస్ట్ పై డిఫరెంట్ రియాక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది మెచ్చుకుంటూ రిప్లై ఇస్తున్నారు. స్ట్రెస్, ఉద్యోగ భయం లాంటివి లేకుండా.. స్ట్రెస్ ఫ్రీ జాబ్ అంటే ఇదే. నచ్చిన పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఫ్యామిలీని లీడ్ చేయడానికి మించి ఏముంటుందని కొందరు రిప్లై ఇచ్చారు. మరి కొందరు అతడిని సమర్ధిస్తూనే.. ఇలా ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తే.. సాఫ్ట్ వేర్ లు అలాగే మోటివేట్ అయ్యి డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకుంటే కష్టం అంటూ కొందరు కామెడీ చేశారు. ఏదైతేనేం మొత్తానికి హైదరాబాదీ ఉబెర్ డ్రైవర్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడనే చెప్పాలి. 

From Amazon to driving

Sometimes, the best career move is the one that makes you happy. pic.twitter.com/FSwCcx79Wc

— Chandana 🌻✨ (@RoseOnX9) June 15, 2026