అయోధ్యకు పాదయాత్ర..రాముడికి బంగారు పాదుకలు తీసుకెళ్తున్న హైదరాబాద్ వాసి

అయోధ్యకు పాదయాత్ర..రాముడికి బంగారు పాదుకలు తీసుకెళ్తున్న హైదరాబాద్ వాసి

హైదరాబాద్ :  హైదరాబాద్​కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్యకు పాదయాత్ర చేస్తున్నారు. బంగారు పాదుకలను తలపై పెట్టుకుని వేలాది కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ కు చేరుకున్నారు. మరో 10 రోజుల్లో అయోధ్యకు చేరుకోనున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసి శ్రీరాముడి బంగారు పాదుకలను అందజేస్తానని శాస్త్రి తెలిపారు. 

‘‘మా నాన్న శ్రీరాముడి భక్తుడు. అయోధ్య కరసేవలో ఆయన పాల్గొన్నారు. అక్కడ రామమందిరం నిర్మిస్తే చూడాలన్నది మా నాన్న కల. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నది. కానీ ఇప్పుడు ఆయన లేరు. మా నాన్న కల నెరవేర్చేందుకు నేను అయోధ్యకు వెళ్తున్నాను. రాముడికి బంగారు పాదుకలు తీసుకెళ్తున్నాను” అని చెప్పారు. తాను ప్రతిరోజు 30 నుంచి 50 కిలోమీటర్లు నడుస్తున్నానని, అయోధ్యకు ఇంకో 272 కిలోమీటర్ల దూరంలో ఉన్నానని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి 5 వెండి ఇటుకలు డొనేట్ చేశానన్నారు.